శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్లో ఎంఎంటీఎస్ ట్రైన్ దిగిన రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఒడిస్సా నుంచి హైదరాబాద్‌కు అక్రమ గంజాయిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదరు నిందితుడు తరలిస్తున్నట్టు గుర్తించారు. చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలిలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్ధులకు నిందితుడు రాహుల్ గంజాయిని విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు
Categories:
Related Posts

ఉప్పు, కారం తింటే నిజం రాయండంటూ.మీడియాపై యాంకర్ అనసూయ ఫైర్ !
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ...

Balagam Director: తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన బలగం వేణు
బలగం సినిమా ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమర్షియల్ సినిమాల మధ్యన వచ్చిన స్వచ్ఛమైన పల్లెటూరి దృశ్యకావ్యం ఈ సినిమా. మన కుటుంబాల్లో కనిపించే ...
కరోనా కొత్త వైరస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే.
జాగ్రత్తలు పాటించాలని, వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో ఉండాలని, తరచూ చేతులు కడుక్కోవాలని సిఫార్సు చేస్తున్నారు. కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతున్న క్రమంలో ఆరోగ్య నిపుణులు పలు సలహాలు ...

కర్నూలు జిల్లాలో దారుణం.కాలేజీ హాస్టల్లో ప్రసవించి విద్యార్థి మృతి
కర్నూలు జిల్లా ప్రాణంలో దారుణం జరిగింది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందారు. హాస్టల్ బాత్ రూంలో తీవ్ర రక్తస్రావంతో చనిపోయారు.రాత్రి 10 ...